Site icon NTV Telugu

Sharmistha Panoli: శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అరెస్టు

Sharmistha Panoli

Sharmistha Panoli

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలు వజాహత్‌పై వెల్లువెత్తాయి. జూన్ 1 నుంచి అతను పరారీలో ఉన్నాడని, పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను హాజరు కాలేదని చెబుతున్నారు. దీని తరువాత, పోలీసులు గార్డెన్ రీచ్ ప్రాంతంలోని అతని ఇంటికి వెళ్లి గాలించారు. చివరకు అతన్ని అరెస్టు చేశారు.

Also Read:Mahesh Kumar Goud: ఖమ్మం జిల్లా కారణంగానే.. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అయ్యారు!

గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో వాజాహత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందూ మతం, దేవతలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా దుర్వినియోగం, రెచ్చగొట్టే, అసభ్యకరమైన భాషను ఉపయోగించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ‘శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్’ అనే సంస్థ జూన్ 2న వాజాహత్‌పై అధికారిక ఫిర్యాదు చేసింది. అంతకుముందు, శర్మిష్ఠ పనోలిని మే 30న గురుగ్రామ్ లో కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో కొంతమంది ముస్లిం బాలీవుడ్ తారలు ‘ఆపరేషన్ సింధూర్’ గురించి మౌనంగా ఉండటం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

Also Read:Ponnam Prabhakar: గౌడ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధం!

వీడియోలో ఉపయోగించిన భాషను మతపరమైనది, అభ్యంతరకరమైనదిగా అభివర్ణించారు. అరెస్టు తర్వాత, పనోలి ఆ వీడియోను తొలగించి క్షమాపణ కూడా చెప్పింది. మరోవైపు, కోర్టు ఇప్పుడు పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల ప్రకారం, ఆమె దేశం విడిచి వెళ్లకూడదు. ఆమె కోర్టులో రూ. 10,000 మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని, ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు దీనిని ఉపయోగించరాదని కోర్టు పేర్కొంది.

Exit mobile version