Site icon NTV Telugu

W/O Anirvesh: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్.. పోస్టర్‌ విడుదల..

Anirvesh

Anirvesh

అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని ఆర్పి పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో నిర్మించిన సినిమా W/O అనిర్వేష్. ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. నిర్మాతలు వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర సారథ్యంలో సినిమా నిర్మించారు. రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు ఈ చిత్రంలో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్. త్వరలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ చేతుల మీదగా ఫిలిం ఛాంబర్‌లో విడుదల చేశారు. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని పట్నాయక్ కొనియాడారు.

READ MORE: Mallikarjun Kharge: మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రశంసలు కోరుకుంటున్నారు

నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అన్నారు. “లింక్డ్ స్క్రీన్ ప్లే” అనే ఫిలిం టెక్నీక్ తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంలో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది కథను దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించారని చెప్పారు. తమ బ్యానర్లో రాబోతున్న W/O అనిర్వేష్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

READ MORE: Pawan Kalyan: బడ్జెట్‌పై పవన్‌కల్యాణ్ ప్రశంసలు.. వికసిత్ భారత్‌కు తోడ్పడుతుందని వ్యాఖ్య

Exit mobile version