Site icon NTV Telugu

VVS Laxman: హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపై వీవీఎస్‌ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

Hardik Pandya

Hardik Pandya

VVS Laxman: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మ ణ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, కేవలం న్యూజిలాండ్‌ టూర్‌కు మాత్రమే ఆయన హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. నవంబర్‌ 30న న్యూజిలాండ్‌ టూర్‌ ముగిసేవరకు ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా, లక్ష్మణ్ కోచ్‌గా శిఖర్ ధావన్ వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వెల్లింగ్టన్‌లో మొదటి టీ20 సందర్భంగా లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇండియా సన్నాహాలతో పాటు ముందున్న సవాళ్ల గురించి మాట్లాడాడు.

భారత క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇక్కడ మనకు చాలా మంది ఆటగాళ్లు ఉన్నారన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఆయన.. నిర్దిష్ట ఆటగాళ్లకు అప్పుడప్పుడు విరామం ఇవ్వాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆటగాళ్ళు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా పునరుత్తేజం పొందేందుకు విరామాలు చాలా ముఖ్యమన్నారు. మీ వైట్-బాల్ క్రికెట్‌లో స్పెషలిస్ట్ ప్లేయర్‌లు అవసరమని ఆయన అన్నారు. టీ20లో చాలా మంది టీ20 స్పెషలిస్ట్‌లు కనిపిస్తారని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమిని చవిచూసిన భారత్ టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

ICC T20I Rankings: నంబర్‌ వన్‌ స్థానం సూర్యకుమార్‌ యాదవ్‌దే..

కెప్టెన్‌గా హార్దిక్ గురించి మాట్లాడుతూ లక్ష్మణ్ ఇలా అన్నాడు: “అతను అద్భుతమైన నాయకుడు. అతను ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఏమి చేసాడో చూశాము. టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీకి మొదటి సంవత్సరంలో నాయకత్వం వహించడంతో పాటు లీగ్‌ను కూడా గెలిచాడు. ఐర్లాండ్ సిరీస్ నుంచి నేను అతనితో చాలా సమయం గడిపాను, అతను వ్యూహాత్మకంగా మాత్రమే కాదు, అతను మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అత్యున్నత స్థాయిలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అతను చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆటగాళ్లందరూ అతని వద్దకు వెళ్లి అతనితో నమ్మకంగా మాట్లాడతారు. నేను హార్దిక్‌లో నిజంగా ఇష్టపడే విషయం అని నేను అనుకుంటున్నాను.” అని లక్ష్మణ్ వెల్లడించారు. ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉన్నా హార్దిక్‌ ప్రశాంతంగా ఉంటాడని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. హార్దిక్ ఆటగాళ్ల కెప్టెన్‌ అని తాను అనుకుంటున్నానన్నారు.

Exit mobile version