Manasa Manasa: రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘అదే నీవు అదే నేను’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా వైవిధ్యమైన కథాంశంతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “అదే నీవు అదే నేను” సినిమా. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొండల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘మనసా మనసా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ లాంఛనంగా విడుదల చేశారు.
సాంగ్ లాంచ్ చేసిన అనంతరం దర్శకుడు వి.వి. వినాయక్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. “దర్శకుడిగా కొండల్‌కు, నిర్మాతగా గోవింద్ గారికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రం వీరికి మంచి పేరుతో పాటు నిర్మాతకు భారీ లాభాలు తీసుకురావాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రొడ్యూసర్ గారికి ఈ విజయం తోడ్పడాలి. ‘మనసా మనసా’ పాట చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. టీమ్ మొత్తానికి నా ఆల్ ది బెస్ట్” అని ఆకాంక్షించారు. తమ చిత్రానికి సపోర్ట్ చేసినందుకు నిర్మాత, దర్శకులు వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
Also Read
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!