మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికి కూడా అంతే ఎనర్జితో ధూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భారీ విజయం నేపథ్యంలో ఆదివారం (జనవరి 25) నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ కూడా ముఖ్య అతిధిగా పాల్గొని, చిరంజీవి పట్ల గ్రామాల్లో ఉండే గౌరవం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Also Read : Simbu : తమిళంలో ఆ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
వినాయక్ మాట్లాడుతూ.. ‘నేను మా ఊర్లో చూశాను.. అందరూ ‘మన శంకర వరప్రసాద్ గారి’ సినిమా బాగుంది అంటున్నారు. అక్కడ ఎవరూ ‘చిరంజీవి సినిమా’ అని పిలవడం లేదు. చిరంజీవి గారి సినిమా అనే మర్యాదతో సంబోధిస్తున్నారు. ఒక్కరు కూడా పేరు పెట్టి పిలవకుండా, అంతటి గౌరవంతో పిలుస్తున్నారంటే.. అది ఆయన ఇన్నేళ్లలో సంపాదించుకున్న మర్యాద, ఆయన హోదా’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ప్రతి ఇంటి మనిషిగా ఆ గౌరవాన్ని పొందారని వినాయక్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
