Site icon NTV Telugu

Domestic Violence: శాడిస్ట్ భర్త చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న నవ వధువు లెటర్‌!

Domestic Violence

Domestic Violence

Vuyyuru Domestic Violence: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శాడిస్ట్ భర్త రాంబాబు చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు అకృత్యాలను సూసైడ్ లెటర్‌లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్‌లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: Jagadish Reddy vs Kavitha: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు జగదీష్ రెడ్డి.. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై చర్చ!

ఆరు నెలల క్రితం విలెజ్ సర్వేయర్ రాంబాబుతో శ్రీవిద్య వివాహం జరిగింది. పెళ్లై‌న కొద్దిరోజుల నుండే శ్రీవిద్యను శారీరకంగా రాంబాబు హింసించాడు. ఆమెను సాయి అనే మహిళతో పోల్చుతూ నీచంగా తిట్టేవాడని, అంతేకాదు రోజు కొట్టేవాడని సూసైడ్ లెటర్‌లో శ్రీవిద్య రాసింది. తలను మంచానికి, తలుపుకి కొట్టడంతో భరించలేని తలనొప్పి వస్తుందని లెటర్‌లో శ్రీవిద్య ఆవేదనగా రాసింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని రాసింది. ప్రస్తుతం రాంబాబు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version