NTV Telugu Site icon

Voter Slip: మీరు ఇంకా ఓటర్‌ స్లిప్‌ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Voter Slip

Voter Slip

Voter Slip Download Options: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మే 13) పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి ‘ఓటర్‌ స్లిప్‌’ చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. పోలింగ్‌ సెంటర్‌ ఎక్కడ?, పోలింగ్‌ స్టేషన్‌లో మన రూమ్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ లాంటి వివరాలు ఈ ఓటర్‌ స్లిప్‌లో ఉంటాయి. ఈ వివరాలు తెలిస్తే.. ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్‌ స్లిప్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీకు ఈ ఓటర్‌ స్లిప్‌ అందలేదా?. అస్సలు టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మొబైల్‌ ద్వారానే ఓటర్‌ స్లిప్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ముందుగా మీ మొబైల్‌లో బ్రౌజర్‌ ఓపెన్ చేయాలి. గూగుల్‌లో https://electoralsearch.eci.gov.in/ ఎంటర్ చేయాలి. ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు మూడు ఆప్షన్లు వస్తాయి. ఓటర్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, పేరు, ప్రాంతం వంటి వివరాలను ఎంటర్‌ చేయాలి. అప్పుడు మీ ఓటర్‌ స్లిప్‌ కనిపిస్తుంది. పీడీఎఫ్‌ రూపంలో ఓటర్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆపై ఓటర్‌ స్లిప్‌ను ప్రింట్‌ తీసుకుంటే చాలు. అందులో మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి.

మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ లేదా యాపిల్‌ మొబైల్‌లో ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్‌ రోల్‌ సెర్చ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి.. వివరాలు నమోదు చేయడం చేయాలి. అప్పుడు ఓటర్‌ స్లిప్ పొందవచ్చు. మొబైల్‌ యాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా ఓటర్‌ స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఓటర్‌ ఐడీపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా.. ఓటర్‌ స్లిప్‌ను పొందవచ్చు.

Also Read: RCB vs DC: మమ్మల్ని ఓడించడం ఢిల్లీకి కష్టమే: బెంగళూరు కోచ్

మెసేజ్‌ ద్వారా కూడా ఓటర్‌ స్లిప్‌ పొందవచ్చు. ECI అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటర్‌ ఐడీ టైప్‌ చేసి 1950 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. వెంటనే మీ పార్ట్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ వంటి సమాచారం మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో వస్తుంది. పై మూడు విధాలుగా మీ ఓటర్‌ స్లిప్‌ సులువుగా పొందవచ్చు.