ప్రస్తుతం దేశావ్యాప్తంగా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఓటు హక్కును వినియోగించు కోవాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి.. కొన్ని కారణాల వల్ల ఎక్కడ పెట్టామో గుర్తుండదు.. ఈ క్రమంలో ప్రభుత్వం ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొబైల్ నంబరు నమోదు తో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసిన తరవాత దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి..
ఆ తరవాత అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే మీరు ఏ మొబైల్ నంబరు నమోదుచేశారో , ఆ ఫోన్‌ను ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.. గవర్నమెంట్ ఇచ్చే కార్డు కోసం వెయిట్ చెయ్యకుండా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.. గతంలో కూడా ఇలాంటి వెసులుబాటు ఉన్నా కూడా ఉపయోగ పడలేదని అధికారులు చెబుతున్నారు.. ఇకపోతే హైదరాబాద్ లో ఎలెక్షన్స్ హడావిడి మొదలైంది.. ఈ ఏడాది ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో చూడాలి..