NTV Telugu Site icon

Vontimitta Sri Sitarama kalyanam: కనుల పండువగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం

Vonti

Vonti

జగదానంద కారకుడు.. జానకీ ప్రాణవల్లభుడు.. శ్రీరాముడు పెళ్ళి కొడుకయ్యాడు.. సీతాదేవి మెడలో మూడుముళ్ళ వేశాడు.. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. పున్నమి వెలుగుల్లో శ్రీసీతారాముల కల్యాణం చూడడానికి భక్తులు పోటెత్తారు. ఒంటిమిట్ట కళ్యాణానికి హాజరయ్యారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, దేవాదాయమంత్రి సత్యనారాయణ. .కోదండ రాముణ్ణి దర్శించుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎ.అమర్నాథ్ రెడ్డి. సీఎం జగన్ రాలేకపోవడంతో.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి…టిటిడి తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి.

Read Also: Man Cheated 30 Women: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. 30 మందిని మోసం చేశాడు

ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశమంతా సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమి రోజు జరుగుతుంది. అయితే, ఒంటి మిట్టలో మాత్రం చైత్ర పొర్ణమి పండు వెన్నెల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రుని కోరిక మేరకు పగటి వేల కళ్యాణం తాను చూడలేనన్న కోరిక తీర్చేందుకు పండు వెన్నెల్లో కళ్యాణం రాముల వారి వరంతో ఈ వేడుక ప్రత్యేకంగా జరుగుతుంటుంది. మరో కథనం మేరకు చంద్ర వంశ రాజులైన విజయనగర రాజులు తమ కుల దైవ మైన చంద్రుణ్ణి ఆరాధిస్తూ రాత్రి పూట కల్యాణాన్ని జరిపించే ఆచారం ఉంది. తెలుగు దనంతో ఉట్టి పడింది రాముల వారి కళ్యాణ వేదిక..వరి కంకులు, ఫల పుష్పాలతో అత్యంత శోభాయమానంగా వేదిక రెడీ చేశారు. దేశ విదేశాలనుంచి తెప్పించిన నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఫలాలతో అలంకరణ చేశారు.

శాశ్వత కళ్యాణవేదిక ప్రాంగణాన్ని చెరుకు గడలు, టెంకాయ గెలలు, పూట, అరటి ఆకులు, మామిడి ఆకులు, వివిధ ఫలాలతో ఆధ్యాత్మిక అలంకరణ ఉట్టిపడేలా అలంకరణలు చేశారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రాష్ట్రవిభజన తర్వాత ఒంటిమిట్ట ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అత్యాధునిక లైటింగ్ సిస్టమ్.. శోభాయమానంగా శాశ్వత కళ్యాణ వేదిక అలరారింది.

ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక
ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక అందచేశారు. సీతమ్మకు బంగారు పతకం.రామయ్యకు కౌస్తుభం బహూకరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బుధవారం కానుకలు అందాయి. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది. ఈ శుభ సందర్బంగా 360 గ్రాముల బరువు గల బంగారు పతకం, కౌస్తుభం ఆభరణాలను కానుకగా అందించారు.టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు. ఆలయం ముందు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.

 

Read Also: SSC Exam Paper Leak : ఏ1 గా బండి సంజయ్‌.. రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు