Site icon NTV Telugu

Volkswagen Golf GTI: టెక్నాలజీ, స్పోర్ట్ లుక్, పవర్ ఫుల్ ఇంజిన్‌తో అదరహో.. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI లాంచ్..!

Volkswagen Golf Gti

Volkswagen Golf Gti

Volkswagen Golf GTI: వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ ప్రఖ్యాత హాట్ హ్యాచ్ మోడల్ గోల్ఫ్ GTIను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు CBU (Completely Built Unit) మార్గంలో దేశానికి దిగుమతి చేయబడింది. భారత మార్కెట్‌కు కేవలం పరిమిత యూనిట్లే రాగా, ఇవి ఇప్పటికే అన్ని అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఇది గోల్ఫ్ GTI లోని 8వ జనరేషన్ మోడల్. ఈ కార్‌ను కింగ్స్ రెడ్ ప్రీమియం, గ్రెనాడిల్లా బ్లాక్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ ప్రీమియం, మూన్‌స్టోన్ గ్రే రంగుల్లో పొందొచ్చు. కారుకి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఆటోమోటివ్ స్టైలింగ్‌ను కొనసాగిస్తూ, స్పోర్టీ లుక్‌ తో తయారుచేయబడింది. 18-అంగుళాల అల్యూమినియం అలాయ్ వీల్స్, బ్లాక్ యాక్సెంట్లతో కూడిన ఫ్రంట్ బంపర్, మేట్రిక్స్ LED హెడ్‌ లైట్లు, అలాగే ఫ్రంట్ డోర్ వద్ద GTI బ్యాడ్జ్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Read Also: Shocking Incident: మరీ ఇంత దారుణమా.. డ్రైవర్‌ను జేసీబీకి కట్టేసి చితకబాదిన రౌడీ షీటర్..!

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది AI ఆధారిత వాయిస్ కమాండ్ల ద్వారా పనిచేస్తుంది. అంతేకాకుండా GTI ప్రత్యేక డిజిటల్ డిస్‌ప్లేలో యాక్సెంట్లు ఉంటాయి. వీటితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ ఇంకా ఎలక్ట్రిక్ సీట్లు, పెడల్ షిఫ్టర్లు, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇక ఇంజిన్, పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గోల్ఫ్ GTIలో 2.0 లీటర్ల ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 265 hp పవర్, 370 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పవర్ అందించబడుతుంది. ఇది ఎలక్ట్రానిక్ ఫ్రంట్-యాక్సిల్ డిఫరెన్షియల్ లాక్ ఫీచర్‌తో కూడా వస్తుంది. ఇక ఈ కారు 0 నుంచి 100 కిమీ/గం వేగానికి కేవలం 5.9 సెకన్లలో చేరగలిగే సామర్థ్యం ఉంది. గరిష్ఠ వేగాన్ని 250 కిమీ/గం వద్ద ఎలక్ట్రానికల్‌గా లిమిట్ చేశారు.

Read Also: OnePlus 13s: ఆల్ సెట్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6.32 అంగుళాల డిస్ప్లే తో లాంచ్ కాబోతున్న వన్‌ప్లస్ 13ఎస్..!

ఇక ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 53 లక్షలగా నిర్ణయించబడింది. ఈ ధరతో గోల్ఫ్ GTI, భారత్‌లో విక్రయానికి ఉన్న వోక్స్‌వ్యాగన్ కార్లలో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచింది. ఇది దేశంలో “GTI” గుర్తుతో వచ్చిన రెండవ మోడల్ కాగా.. మొదటిది పోలో GTI. మొత్తంగా వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI భారత మార్కెట్‌లో ఆటో ఎంథూసియాస్ట్‌ లకు ఒక ప్రీమియం హాట్ హ్యాచ్ ఆప్షన్‌ను అందించబోతోంది. పరిమిత సంఖ్యలో లభించడమే కాకుండా, అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, ఇంకా ఇంటెలిజెంట్ ఫీచర్లతో ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది.

Exit mobile version