NTV Telugu Site icon

Vizianagaram Pydithalli Utsavam: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు.. ఘనంగా తోలేళ్ళ ఉత్సవం

pydithalli amma vzm

00791dc1 3898 469e A36d 6896d3531074

పైడితల్లి అమ్మ పండగ అంటే ఉత్తరాంధ్ర వారికి పండుగే పండుగ. ఉత్తరాంధ్ర ప్రజల ఇష్ట దైవం, భక్తుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవానికి తెర లేచింది. తొలేళ్ల ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి పండగ శోభ సంతరించుకుంది. మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో సందడిగా మారింది. పూసపాటి గజపతుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పూసపాటి అశోక్ గజపతి రాజు. కుటుంబ సమేతంగా అమ్మవారి గుడికి వచ్చి దర్శించుకున్నారు అశోక్ గజపతి రాజు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికారు. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందచేశారు.

అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలితో తొలిత దున్నాలి. దానినే తొలి ఏరు అని… తొలేళ్లనీ పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలూ.. దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కోటకి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతులతో ఆ విత్తనాలను అందించి అమ్మ ఆశీర్వదిస్తుంది. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు, మంచి దిగుబడులు సాధిస్తారు.

Read Also: Komatireddy Venkat Reddy: ఈనెల 15న ఆస్ట్రేలియా పర్యటన.. మరి మునుగోడు ప్రచారం సంగతేంటి?

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య ధైవంగా భావించే పైడితల్లి అమ్మావారి పండగ వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి పండగ రోజుల్లో మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో పండగ శోభ సంతరించుకుంది. రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి ప్రదేశం, మూడు లాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్‌ దీపాలంకరణ లతో వెలుగులు జిమ్ముతున్నాయి. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. చల్లని తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు సన్నద్ధమయ్యారు. అంగరంగ వైభవంగా కార్నివాల్ తో ఉత్సవాలను ప్రారంచించారు. తోలేళ్లకు సిద్ధమయ్యారు. వేకువ జామున 3 గంటల నుంచి అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు. రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. రాత్రి భాజా భజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలోకి పూజారులు వెళ్లనున్నారు.. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహించారు. ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి, మొక్కులు చెల్లిస్తారు. ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యం విత్తనాలను అందజేస్తారు. ఈ తోలేళ్లు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read Also: Womens Asia Cup 2022: గెలుపే లక్ష్యంగా.. నేడు థాయ్‌లాండ్‌తో భారత్‌ ఢీ