NTV Telugu Site icon

Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్స్!

Vivo V40 5g

Vivo V40 5g

Vivo V40 Pro and Vivo V40 Launched in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వివో’ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘వీ’ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40 ప్రో’, ‘వివో వీ40’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ మొబైల్స్‌ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నాయి. 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుండడం విశేషం. వివో వీ40 ప్రో, వివో వీ40 ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివో వీ40 ప్రో 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.49,999గా ఉండగా.. 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.55,999గా ఉంది. బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఆగస్టు 13 నుంచి వివో స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వివో వీ40 మూడు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.34,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.36,999గా…12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.41,999గా ఉంది. బ్లూ, లోటస్‌ పర్పుల్‌, టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులో ఉండే ఈ మొబైల్స్‌ విక్రయాలు ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానున్నాయి.

వివో వీ40 ప్రో స్పెసిఫికేషన్స్ (Vivo V40 Pro Spes):
# 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు
# 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# 4ఎన్‌ఎమ్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌
# ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14
# 50 ఎంపీ సోనీ IMX921 ప్రైమరీ సెన్సర్‌ (50 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎక్స్‌ ఆప్టికల్ జూమ్, 50 ఎంపీ సోనీ IMX816 టెలిఫోటో)
# 50ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

Also Read: Meenakshi Seshadri: హీరోల సుదీర్ఘ కెరీర్‌కు ఆ మూడే కారణాలు.. మీనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు!

వివో వీ40 స్పెసిఫికేషన్స్ (Vivo V40 Specs):
# 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేటు
# 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14
# జీస్‌ 50ఎంపీ ప్రధాన కెమెరా (50ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎక్స్‌ ఆప్టికల్ జూమ్)
# 50ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

Show comments