NTV Telugu Site icon

Vivo T3X 5G Price: వివో నుంచి బడ్జెట్‌ 5G ఫోన్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

Vivo T3x 5g Price

Vivo T3x 5g Price

Vivo T3X 5G Smartphone Lauch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘వివో’ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో భాగంగా ‘వివో టీ3 ఎక్స్‌’ను విడుదల చేసింది. టీ2 ఎక్స్‌కు కొనసాగింపుగా దీనిని కంపెనీ తీసుకొచ్చింది. టీ2 ఎక్స్‌ను బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరాను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త ఫోన్‌ను రూపొందించింది. వివో టీ3 ఎక్స్‌ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వివో టీ3ఎక్స్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా.. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.16,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ విడుదల సందర్భంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,500 వరకు రాయితీ లభిస్తోంది. ఏప్రిల్‌ 24 నుంచి వివో ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ3ఎక్స్‌ విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈరోజు నుంచి ప్రీ-బుకింగ్‌ మొదలయ్యాయి.

వివో టీ3 ఎక్స్‌లో 6.72 అంగుళాల ఫ్లాట్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ ఉంటుంది. దీని రిఫ్రెష్‌ రేటు 120Hz. వెనకభాగంలో 50 ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్‌ కెమెరా సెటప్‌ ఉండగా.. ముందున 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన సెంటర్డ్‌ పంచ్‌ హోల్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024.. దినేష్, పరాగ్‌కు నిరాశే! భారత జట్టు ఇదే

వివో టీ3 ఎక్స్‌లో 44వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000 mAh బ్యాటరీని ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14 ఔటాఫ్‌ బాక్స్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు. బ్లూటూత్‌ 5.1, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఫీచర్లూ ఇందులో ఉన్నాయి.