Site icon NTV Telugu

Vivo T3 5G Launch: వివో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

Vivo T3 5g Price

Vivo T3 5g Price

Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’.. భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో గతేడాది విడుదల చేసిన టీ2కు కొనసాగింపుగా.. టీ3 5జీ (వివో టీ3 5జీ)ని విడుదల చేసింది. గురువారం (మార్చి 21) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో వివో టీ3 5జీని కంపెనీ లాంచ్ చేసింది. అమోలెడ్‌ డిస్‌ప్లే, 4కె వీడియో రికార్డింగ్‌, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ రిలీజ్ అయింది. వివో టీ3 5జీకి సంబందించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

వివో టీ3 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ మోడల్‌ ధర రూ.19,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999గా ఉంది. మార్చి 27 నుంచి వివో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌కు రానుంది. లాంచ్‌ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీ కార్డ్స్‌తో కొనుగోలు చేస్తే.. రూ.2 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. మార్చి 31 లోపు కొనుగోలుపై ఇయర్‌ ఫోన్స్‌ (vivo XE710)ను ఉచితంగా అందిస్తున్నారు. రెండు రంగుల్లో (కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ ఫ్లేక్‌) ఇది లభిస్తుంది.

వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఇది వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌ ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

Also Read: IPL 2024: బెంగళూరు మ్యాచ్‌లకు నీటి కష్టాలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!

వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐంఎఎక్స్‌ 882 సెన్సర్‌ అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో ఈ ఫోన్ వస్తోంది. 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఇందులో ఉంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉండగా.. 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Exit mobile version