Vivo T3 5G Launch: మార్చి 21న వివో టీ3 5జీ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్‌ల డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన వివో.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ‘వివో టీ3 5జీ’ ఫోన్‌ను మార్చి 21న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనున్నది.
వివో టీ3 5జీ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉంటుందని తెలుస్తోంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. ఇది క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుందని సమాచారం. 8 జీబీ+128 జీబీ, 8 జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో పాటు 6.67 అంగుళాల ఫుల్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
Also Read
Also Read: IPL 2024: సీఎస్‌కేకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
వివో టీ3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 లెన్స్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ బొకెహ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉండనుంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!