Vivo T2 Pro 5G Launch: సెప్టెంబర్ 22న ‘వివో T2 ప్రో 5G’ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T2 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రీలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లనే కాకుండా.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఫోన్లను కూడా రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు వివో సిద్ధమవుతోంది. టీ-సిరీస్‌లో భాగంగా ‘వివో T2 ప్రో 5G’ (Vivo T2 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది.
Vivo T2 Pro 5G Release Date:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. 22న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవనుంది. ఈ విషయాన్ని ‘ వివో ఇండియా’ తన ఎక్స్‌లో పేర్కొంది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వివో T2 ప్రో 5G రాబోతుందని ట్వీట్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Vivo T2 Pro 5G Camera:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ. 23,999గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ మైక్రో-సైట్‌ను కూడా వివో క్రియేట్ చేసింది. ఈ టీజర్ ప్రకారం.. వివో T2 ప్రో 5G ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. వెనుక భాగంలో 64MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ సపోర్ట్‌తో 4K వీడియోలను క్యాప్చర్ చేయగలదు. వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
Also Read: Asia Cup Final: గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు షాక్.. ఫైనల్‌కు స్టార్ ప్లేయర్ దూరం!
Vivo T2 Pro 5G Specs:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్తో రానుందని తెలుస్తోంది. 8GB RAM/128GB, 8GB RAM/256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండొచ్చు. ఎప్పుడూ వివో అందించే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ రానుంది. పూర్తి వివరాలు రిలీజ్ అయ్యాక తెలియరానున్నాయి.
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!