NTV Telugu Site icon

Vivo T2 Pro 5G Launch: సెప్టెంబర్ 22న ‘వివో T2 ప్రో 5G’ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Vivo T2 Pro 5g

Vivo T2 Pro 5g

Vivo T2 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రీలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు వివో సిద్ధమవుతోంది. టీ-సిరీస్‌లో భాగంగా ‘వివో T2 ప్రో 5G’ (Vivo T2 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది.

Vivo T2 Pro 5G Release Date:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. 22న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవనుంది. ఈ విషయాన్ని ‘ వివో ఇండియా’ తన ఎక్స్‌లో పేర్కొంది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం వివో T2 ప్రో 5G రాబోతుందని ట్వీట్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

Vivo T2 Pro 5G Camera:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ధర సుమారు రూ. 23,999గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ మైక్రో-సైట్‌ను కూడా వివో క్రియేట్ చేసింది. ఈ టీజర్ ప్రకారం.. వివో T2 ప్రో 5G ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. వెనుక భాగంలో 64MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ సపోర్ట్‌తో 4K వీడియోలను క్యాప్చర్ చేయగలదు. వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

Also Read: Asia Cup Final: గెలుపు ఆనందంలో ఉన్న శ్రీలంకకు షాక్‌.. ఫైనల్‌కు స్టార్‌ ప్లేయర్ దూరం!

Vivo T2 Pro 5G Specs:
వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో రానుందని తెలుస్తోంది. 8GB RAM/128GB, 8GB RAM/256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండొచ్చు. ఎప్పుడూ వివో అందించే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ రానుంది. పూర్తి వివరాలు రిలీజ్ అయ్యాక తెలియరానున్నాయి.

Show comments