Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo S60 Series Launched: చైనా మార్కెట్లో వివో (Vivo) నుండి కొత్త S60 సిరీస్‌ను లాంచ్ అయ్యింది. ఈ సిరీస్‌లో Vivo S60, Vivo S60e (వైటాలిటీ ఎడిషన్) మోడళ్లు ఉన్నాయి. స్లిమ్ డిజైన్, ప్రీమియం కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్లు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
ప్రీమియం డిజైన్:
Vivo S60 సిరీస్ కేవలం 7.92 మి.మీ. మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఫోన్ బరువు సుమారు 205 గ్రాములు మాత్రమే. స్టార్రీ సీ, ఎర్లీ సమ్మర్ గ్రీన్, మిడ్సమ్మర్ నైట్ అనే మూడు ప్రత్యేక కలర్ వేరియంట్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా స్టార్రీ సీ వేరియంట్లో డైమండ్‌లాంటి ఫ్రాస్టెడ్ టెక్స్చర్ను అందించేందుకు అధునాతన స్టార్బర్స్ట్ లిథోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించారు. మెటల్ ఫ్రేమ్, యూనిబాడీ గ్లాస్ బ్యాక్ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
Also Read
డిస్ప్లే:
ఈ సిరీస్‌లో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేను అందించారు. 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే HDR10+ సపోర్ట్, 4320Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కెమెరా సెక్షన్:
సెల్ఫీల కోసం రెండు మోడళ్లలోనూ 50 MP ఫ్రంట్ కెమెరాను అందించారు. Vivo S60లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP Sony IMX882 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. Vivo S60eలో మాత్రం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే లభిస్తుంది. ఈ సిరీస్‌లో 4K లైవ్ ఫొటోస్, 3D స్పటిల్ ఇమేజింగ్, Naked-Eye 3D ఎఫెక్ట్స్ వంటి ఆధునిక ఫోటోగ్రఫీ ఫీచర్లను కూడా వివో అందించింది.
శక్తివంతమైన ప్రాసెసర్లు:
పనితీరు పరంగా రెండు ఫోన్లు వేర్వేరు చిప్సెట్లతో వస్తున్నాయి. Vivo S60లో Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ను అందించగా, Vivo S60eలో MediaTek Dimensity 7500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. LPDDR5X RAM, 512GB వరకు స్టోరేజ్ సపోర్ట్‌తో ఈ ఫోన్లు మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి.
భారీ బ్యాటరీ:
ఈ సిరీస్‌లోని ప్రధాన ఆకర్షణ 7200mAh సామర్థ్యం గల “బ్లూ ఓషన్” బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్ డిజైన్‌ను వివో కొనసాగించడం విశేషం. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.
అదనపు ఫీచర్లు:
Vivo S60 సిరీస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 & IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్లు, NFC, IR బ్లాస్టర్, X-Axis లీనియర్ మోటార్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ధరలు:
వివో S60e 8GB + 256GB వేరియంట్ ధర 2899 యువాన్ (సుమారు రూ.40,600)గా నిర్ణయించారు. 12GB + 256GB మోడల్ 3199 యువాన్, 12GB + 512GB వేరియంట్ 3499 యువాన్ ధరలకు అందుబాటులో ఉంటుంది. ఇక Vivo S60 12GB + 256GB మోడల్ ధర 3599 యువాన్ (సుమారు రూ.50,400) కాగా, 12GB + 512GB వేరియంట్ 3999 యువాన్, 16GB + 512GB వేరియంట్ 4399 యువాన్ ధరలకు విక్రయించనున్నారు. Vivo S60 సిరీస్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. జూన్ 3 నుంచి అధికారిక విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో ఈ ఫోన్ల లాంచ్‌పై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!