NTV Telugu Site icon

Vivo Y19s: సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్‭లో ఫోన్‭ను లాంచ్ చేసిన వివో

Vivo

Vivo

Vivo Y19s: వివో గ్లోబల్ మార్కెట్‌లో కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18s తర్వాత Vivo Y19sను తీసుక వచ్చింది. చాలా పెద్ద మార్పులతో దీన్ని తీసుకొచ్చింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ, 6.68 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నోటిఫికేషన్‌లు, ఇతర హెచ్చరికల కోసం వివిధ రంగులలో మెరిసిపోతుంది. థాయ్‌లాండ్‌లో Vivo Y19s ధర 4GB + 64GB వేరియంట్‌కు THB 3,999 భారతదేశ కరెన్సీలో దాదాపు (రూ. 9,840), 4GB/128GB మోడల్‌కు THB 4,399 (రూ. 10,830), 6GB/128GB మోడల్‌కు THB 4,990 అంటే (రూ. 11,000) గా ఉన్నాయి. తాజా స్మార్ట్‌ఫోన్ థాయ్‌లాండ్‌లోని వివో ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది గ్లోసీ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, పెరల్ సిల్వర్ రంగులలో విడుదల చేయబడింది.

Read Also: Koti Deepotsavam 2024: దారులన్నీ ఇల కైలాసం వైపే.. కోటి దీపోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Vivo Y19s పెద్ద 6.68 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 x 1,608 పిక్సెల్‌లు. ఈ ఫోన్ 12nm Unisoc T612 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది చాలా వేగంగా పని చేస్తుంది. ఇది గరిష్టంగా 6GB RAM, 128GB ROM నిల్వను కలిగి ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్14లో నడుస్తుంది. వివో స్వంత Funtouch OS 14 వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. వివో Y19sలో రెండు వెనుక కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. దానితో పాటు చిన్న డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఇది ఫోటోలలో బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేయడంలో సహాయపడుతుంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Vivo Y19s బ్యాటరీ 5,500mAh. దీన్ని ఛార్జ్ చేయడానికి కేవలం 15W ఛార్జర్ మాత్రమే అందించబడుతుంది. ఫోన్ వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని ద్వారా మీరు ఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫోన్ నీరు, దుమ్ము నుండి సురక్షితంగా ఉండేలా డిజైన్ చేసారు. ఇది 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ లక్షణాలను కలిగి ఉంది.

Read Also: Apple iOS 18.2: స్టన్నింగ్ ఫీచర్లతో సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ను ఇచ్చిన ఆపిల్ సంస్థ

Show comments