NTV Telugu Site icon

Viveka Case: ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

Mp Avinash Reddy

Mp Avinash Reddy

వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి అవినాష్ రెడ్డి. దీనిపై ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు సీబీఐ అధికారులు. ఈరోజు వేంపల్లి మండలంలో గృహసారధుల కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎంపి అవినాష్ రెడ్డి. వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసిపి సమావేశం జరగనుంది. ఈరోజు కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహంలో సిబిఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

Read Also: Bandi Sanjay : రాత్రి 1 గంట తర్వాతనే ధరణి పోర్టల్ తెరుచుకుంటుంది

ఈనెల 12 లోపు విచారణకు హాజరు కావాలని భాస్కరరెడ్డికి సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు అందచేశారు. అయితే ఈరోజు విచారణకు వస్తారా లేక 12నే హాజరవుతారా అనే దానిపై స్పష్టత లేదు. వేంపల్లి మండల వైసిపి గృహ సారథులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులతో సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొంటారు. ఈ కేసు విచారణ విషయంలో సీబీఐ దూకుడు మీద ఉంది.

సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. అలాగే సోమవారం కడప రావాలని భాస్కర్‌రెడ్డికి వేరుగా నోటీసులిచ్చారు. ఇప్పటికే అవినాశ్‌రెడ్డిని జనవరి 28న, ఫిబ్రవరి 24న సీబీఐ ప్రశ్నించింది. వాస్తవానికి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరుకావాలని భాస్కర్‌రెడ్డికి మూడ్రోజుల క్రితమే నోటీసులిచ్చింది. ఆయన్ను పిలవడం ఇదే మొదటిసారి. అయితే చెప్పిన తేదీకి ఆర్రోజుల ముందే విచారణకు రమ్మని ఆయన్ను పిలవడం ఆసక్తి రేపుతోంది.

ఇదిలా ఉంటే.. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్‌రెడ్డిని కలిసిన ఐదుగురు వ్యక్తులను సీబీఐ విచారించింది. గడచిన నాలుగు రోజులుగా కొందరు అనుమానితులను సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌ కేంద్రంగా విచారిస్తోంది. వీరిలో పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ)లో పనిచేస్తున్న సుధాకర్‌ అనే ఉద్యోగిని కూడా విచారించింది. హత్య వెనుక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు ఇప్పటికే రెండుసార్లు అవినాశ్‌రెడ్డిని ప్రశ్నించింది. కీలకంగా మారిన రూ.40 కోట్ల సుపారీపై ఆరాతీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు సంభవిస్తాయంటున్నారు.

తాజా అప్ డేట్.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది..పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీబీఐ అధికారులు..ఈ నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు సీబీఐ..నాలుగు రోజుల క్రితం నేడు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.ముందస్తు షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని చెప్పారు ఎంపీ.. వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు..12న కడపలో విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చింది.

Read Also: Monday Bhakthi Tv Stothra Parayanam Live: జాతకంలో నాగదోషం తగ్గాలంటే..