Site icon NTV Telugu

Vivek Daughter Marriage: సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా దివంగత కమెడియన్ కూతురి పెళ్లి..!

133

133

దివంగత కోలీవుడ్ కమెడియన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకి. పక్క కామెడీ టైమింగ్ తో తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు దివంగత నటుడు వివేక్. ఈయన తమిళంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో కూడా ఆయన చేసిన సినిమాలు వచ్చాయి. వివేక్ 2021 లో గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఈయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. అనేక సినిమాలలో ఆయన తన కామెడీ టైమింగ్ తో ప్రజలను నవ్విస్తూ వివేక్ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

Also read: Leopard: తిరుమల నడకమార్గంలో మళ్లీ కలకలం.. ఐదు సార్లు చిరుత సంచారం

ఇక తాజాగా మార్చి 28 వివేక్ కూతురు తేజస్విని వివాహం భరత్ తో జరిగింది. గురువారం నాడు చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని వివేక్ నివాసంలోనే అతికొద్ది సన్నిహితుల సమక్షంలో మీరు వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్లిలో భాగంగా తన తండ్రి జ్ఞాపకార్థం వివేక్ కుమార్తె తేజస్విని తన భర్తతో కలిసి మొక్కలు నాటింది.

Also read: AAP Minister Atishi : ఈడీకి కాదు బీజేపీకి కేజ్రీవాల్ ఫోన్ పాస్ వర్డ్ కావాలి : ఢిల్లీ మంత్రి అతిషి
తేజస్విని తన తండ్రి కల కోసం తన వంతు ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్టు ఆవిడ తెలిపారు. అలాగే వివాహానికి హాజరైన ఆధితులకు దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన వివేక్ అభిమానులు కొందరు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వెండితెరపై తన నటనతో అందరిని అలరించిన వివేక్ నిజ జీవితంలో చాలామందికి రోల్ మోడల్ అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. ఇదివరకు వివేక్ బతికి ఉన్నప్పుడు అబ్దుల్ కలాం ఆదర్శంగా తీసుకుని లక్షలాది మొక్కలను నాటారు. చాలాసార్లు ప్రకృతిని కాపాడాలంటూ పిలుపును కూడా ఇచ్చేవారు.

Exit mobile version