Site icon NTV Telugu

Vivek Agnihotri : ఇండియన్ ఎయిర్ లైన్స్ పై మండిపడిన వివేక్ అగ్నిహోత్రి..

Whatsapp Image 2023 11 30 At 12.24.01 Am

Whatsapp Image 2023 11 30 At 12.24.01 Am

వివేక్ అగ్నిహోత్రి..’ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం తో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించాడు.వివేక్‌ అగ్నిహోత్రి రీసెంట్ గా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలవగా.ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నది.ఈ దర్శకుడు నిత్యం తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తూ వుంటారు.ఈ దర్శకుడు ముఖ్యంగా బాలీవుడ్‌ పై విమర్శలు చేస్తూ వుంటారు. తాజాగా ఇండిగో ఎయిర్‌ లెన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం గంటన్నరకుపైగా ఆలస్యం కావడంతో తాను ఇబ్బందులకు గురయ్యారని అలాగే విమానంలో మరుగుదొడ్లు కూడా శుభ్రంగా లేవంటూ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసారు.తాను ఉదయం 11.10 గంటలకు విమానం ఎక్కానని.. మధ్యాహ్నం 12.40 గంటలకు వరకు విమానంలోనే తాను ఉండిపోయినట్లు చెప్పుకొచ్చారు.. దాదాపు 1.30 గంటలు ఆలస్యమైనా విమానం క్రూ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వలేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఆలస్యమవుతూ ఉన్నాయని అయితే, ఇండిగోలో ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విమానం ఎందుకు ఆలస్యం అయిందో తెలుసుకునే మార్గం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.లేటెస్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్‌ దేని కోసం అంటూ ప్రశ్నించారు. దిక్కుతోచని సిబ్బందితో పాటు ప్రయాణికులను ఏసీ టన్నెల్లో ఎందుకు బంధించారంటూ ఆయన మండిపడ్డారు.టాయిలెట్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.. నీటి కోసం ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందులు పడ్డారని అన్నారు. తాను ఇండిగోలో చాలా అరుదుగా ప్రయాణిస్తుంటానని విమానయాన సంస్థలు, సిబ్బంది ఉదాసీనంగా, అహంకారంతో ప్రవర్తిస్తున్నాయని ఆయన అన్నారు… విమానాలు 30 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఛార్జీలో కొంత వాపస్‌ చేయకూడదా అంటూ ఎయిర్ లైన్స్ వారిని ప్రశ్నించారు.

Exit mobile version