Indian Business Legend: పండుగ ఏదైనా పబ్బం ఏమైనా మద్యం ప్రియులు అక్కడ ఉన్నారంటే వారి నాలుక ఒకదాని కోసం తహతహలాడుతుంది.. ఇంతకీ అది ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మద్యం. ఈ మద్యంలో కూడా ఓ ఫేమస్ బ్రాండ్ ఎక్కువ మంది స్పెషల్ ఛాయిస్‌గా ఉంది. అందేంటి అనుకుంటున్నారా.. కింగ్ ఫిషర్. మీకు తెలుసా ఈ కంపెనీ స్థాపకులు ఎవరో.. విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా అనుకుంటే పొరపాటు చేసినట్లే.. ఆయన కాదు గురు.. ఆయన తండ్రి విఠల్ మాల్యా. భారత దేశ మద్యం వ్యాపారంలో మకుటం లేని మహారాజు.. చుక్క ముట్టకుండానే కిక్ ఇచ్చే సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన.. తన జీవిత కాలంలో దివాళ అంచున ఉన్న ఎన్నో సంస్థలను విజయతీరాల వైపు పరుగులు పెట్టించిన సక్సెస్‌పుల్ వ్యాపారవేత్త. ఆయన ప్రస్థానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
ఓ ఆర్మీ డాక్టర్ కొడుకు స్థాయి నుంచి..
అవకాశాల కోసం తపనతో, విద్యార్థిగా ఉన్నప్పుడే విట్టల్ మాల్యా తన వ్యాపార ప్రయత్నాలను ప్రారంభించాడు. ఓ సాధారణ ఆర్మీ డాక్టర్‌కు జన్మించిన ఆయన డూన్ స్కూల్‌లో తన చివరి సంవత్సరంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారని చెబుతారు. పాఠశాల తర్వాత ఆయన తన తండ్రి పోస్టింగ్‌ల కారణంగా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. కలకత్తాలో తన కళాశాల రోజుల్లో మాల్యా స్టాక్ మార్కెట్‌లో మునిగిపోయారు. ఇదే ఆయన తన భవిష్యత్తులో చేసిన సాహసాలకు పునాది వేసిందని చెబుతారు.
భారతదేశంలో అతిపెద్ద మద్యం సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత..
విఠల్ మాల్యా స్వయంగా ఎప్పుడూ మద్యం తాగలేదు. కానీ ఆయన మద్యం పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించి ఇండియాలో విస్తారమైన మద్యం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి బతికినంత కాలం ఆ సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తిలా బతికారు. కిసాన్, క్యాడ్‌బరీ, బెర్గర్ పెయింట్స్, హిందూస్తాన్ పాలిమర్స్, మంగళూరు ఫెర్టిలైజర్స్, బ్రిటిష్ పెయింట్స్, మైసూర్ ఎలక్ట్రో-కెమికల్ వర్క్స్ వంటి ప్రముఖ కంపెనీల ద్వారా ఆయన తన పేరును ముఖ్యంలో భారత దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. కష్టాల్లో ఉన్న కంపెనీలను విజయతీరాలకు చేర్చి, వాటిని లాభదాయక వ్యాపార సంస్థలుగా మార్చడంలో విఠల్ మాల్యా నిష్ణాతుడనే పేరు ఉంది. 1981 నాటికి విఠల్ మాల్యా 10 బ్రూవరీలు, 14 డిస్టిలరీలు, ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ, పెట్టుబడి సంస్థలు, ప్యాకేజింగ్ యూనిట్లు, ఫార్మాస్యూటికల్ తయారీదారులు, శీతల పానీయాల బాటిలింగ్ ప్లాంట్లు, స్టైరిన్ కంపెనీలను కలిగి ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఉండే వారు.
30 కి పైగా కంపెనీలు
విట్టల్ మాల్యా ఫినిట్ ద్వారా దేశీయ పురుగుమందుల మార్కెట్‌లో 75 శాతం వాటాను కైవసం చేసుకున్నారు. అనంతరం ఆయన చూపు సింగర్ కుట్టు యంత్రాలు, క్యాడ్‌బరీ చాక్లెట్లు, హోచ్స్ట్, రౌసెల్ వంటి కంపెనీలకు అవసరమైన ఔషధాలను తయారు చేసే పరిశ్రమలపై పడింది. వ్యూహాత్మక పెట్టుబడులపై, తెలివైన నిర్ణయాలు, ఆయన వేగవంతమైన వృద్ధికి కారణం అయ్యాయి. బ్యాటరీల నుంచి పాలిమర్‌ల వరకు, తోటల పెంపకం నుంచి పెయింట్‌ల వరకు ఆయన తన సంస్థలను విస్తరించి 30 కి పైగా కంపెనీలను ఏర్పాటు చేశాడు.
1946-47లో ప్రారంభమైన జైత్రయాత్ర..
1946-47లో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో విట్టల్ మాల్యా వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన తన జైత్రయాత్రను ప్రారంభించారు.1947లో ఆయన ఈ కంపెనీకి మొదటి భారతీయ డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు. బీర్, మద్యం, ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్‌లపై ఈ సంస్థకు మోజార్టీ వాటా ఉంది. అనంతరం కాలంలో ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించారు. 1952లో బెంగళూరుకు వెళ్లిన మాల్యా చిన్న బ్రూవరీలు, డిస్టిలరీలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, బీహార్‌లలో కొత్త బ్రూవరీ కంపెనీలతో ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన 1960ల ప్రారంభంలో కేర్ & ఫిప్సన్‌ను, 1970ల ప్రారంభంలో హెర్బర్ట్‌సన్స్‌ను సంస్థలను కొనుగోలు చేశారు.
1962లో ఆహార ఉత్పత్తుల రంగంలోకి..
1962లో విట్టల్ మాల్యా కిసాన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆహార ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించారు. ఒక దశాబ్దం తర్వాత ఆయన హెర్బర్ట్ సన్స్, దాని డిప్స్ విభాగాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఆయన క్రమంగా వివిధ ప్రాసెస్ చేసిన ఆహారాలపై తన పట్టును బలోపేతం చేసుకున్నారు. మాల్యా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి రెండు వందల ఎకరాల భూమిని లీజుకు తీసుకుని నర్సరీని స్థాపించారు. తరువాత కాశ్మీరీ రైతులకు హాప్స్ మొలకల పంపిణీ చేసి, వారి అన్ని ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఇది ఆయనకు బీర్ పరిశ్రమలోని అతి ముఖ్యమైన భాగంపై నియంత్రణను ఇచ్చినట్లు అయ్యింది.
1970 లో ఎదురైన పరీక్ష..
1970ల మధ్యలో మద్యం నిషేధ ప్రచారం కారణంగా ఒక్కసారిగా మద్యం పరిశ్రమ అతలాకుతలం అయ్యింది. ఈ విపత్కర సమయంలో ఆయనకు ఎదురైన మొదటి పరీక్ష. ఈ సమయంలో ఆయన తన వ్యాపార చతురతను, దూరదృష్టిని ప్రదర్శించి, మరిన్ని బ్రూవరీలు, డిస్టిలరీలను కొనుగోలు చేశారు. మార్కెట్ తిరోగమనాన్ని అధిగమించిన తర్వాత మద్యం సామ్రాజ్యంలో మకుటుం లేని చక్రవర్తిగా నిలిచారు. విఠల్ మాల్యా వ్యక్తిగత జీవితం చాలా నిరాడంబరంగా ఉండేదని ఆయనను అతిసమీపంలో నుంచి చూసిన వ్యక్తులు చెబుతుంటారు. ఆయన మొదటి భార్యకు పుట్టిన సంతానం విజయ్ మాల్యా. విఠల్ మాల్యాకు మూడుసార్లు వివాహం జరిగింది. ఆయన తన జీవత పర్యంతం ఎప్పుడూ కూడా విలాసవంతమైన పార్టీలు, విదేశీ పర్యటనలు లేదా సూపర్ కార్లను ఇష్టపడలేడిన సందర్భాలు లేవని చెబుతారు. ఆయన పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండేవాడని, ఇదే విషయాన్ని తన కొడుకు విజయ్ మాల్యకు కూడా నేర్పించడానికి ప్రయత్నించాడని చెబుతారు. అయితే ఈ సూత్రాల విజయ్ మాల్యకు సరిపోలలేదు. విఠల్ మాల్యా డిసెంబర్ 1983లో తన 59 ఏళ్ల వయసులో మరణించారు. అప్పటి వరకు కూడా ఆయన భాతరదేశంలో అతిపెద్ద మద్యం సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఆయన, చివరి రోజుల్లో కూడా చుక్క మద్యం ముట్టుకోలేదు.
UB అతిపెద్ద బీర్ కంపెనీ.
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద బీర్ కంపెనీ. ఇది భారతీయ బీర్ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలో అనేక ప్రసిద్ధ, ఐకానిక్ బ్రాండ్‌లు ఉన్నాయి. భారతీయ బీర్ మార్కెట్‌లో వాటాలో UB 40 శాతానికి పైగా మార్కెట్ సొంతం చేసుకొని తిరుగులేని “రాజు”గా కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు ₹47,487 కోట్లు. డచ్ బహుళజాతి కంపెనీ హీనెకెన్ UBలో 70.83% వాటా కలిగి ఉండటంతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచింది.
యునైటెడ్ స్పిరిట్స్ గతంలో UB గ్రూప్‌లో ఉండేది..
యునైటెడ్ స్పిరిట్స్ విస్కీ, రమ్, వోడ్కా, బ్రాందీ వంటి స్పిరిట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది గతంలో విజయ్ మాల్యా UB గ్రూప్‌లో భాగంగా ఉండేది. అయితే 2014లో బ్రిటిష్ స్పిరిట్స్ తయారీదారు డియాజియో యునైటెడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ఇది డియాజియో అనుబంధ సంస్థగా మారింది. మెక్‌డోవెల్స్ నంబర్ వన్, బాగ్‌పైపర్, రాయల్ ఛాలెంజ్, సిగ్నేచర్, యాంటిక్విటీ, బ్లాక్ డాగ్ యునైటెడ్ స్పిరిట్స్ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన విస్కీ బ్రాండ్‌లలో కొన్ని.
READ ALSO: గుండె నుండి కంటి వరకు: క్యారెట్ యొక్క అద్భుత శక్తి
