NTV Telugu Site icon

Viswak Sen : సినిమా చూడకుండానే రివ్యూస్ ఎలా ఇస్తారు..

Gangs Of Godavari

Gangs Of Godavari

Viswak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి “.ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ సినిమా ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించారు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది .క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా కథ పాతది అయినా కూడా దర్శకుడు కృష్ణ చైతన్య తన టేకింగ్ తో అదరగొట్టాడు.

Read Also :Mirai : “మిరాయ్” 3D ఫార్మాట్ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..?

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.ఈ సినిమాలో నటి అంజలి తనదైన యాక్టింగ్ తో ఎంతగానో మెప్పించింది.ఇక హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామర్ తో పాటు నటన పరంగా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే సినిమాకు ఫేక్ రివ్యూస్ ఇచ్చే వారిపై హీరో విశ్వక్ సేన్ మండి పడ్డాడు.మూవీ టికెట్స్ కొన్నవారే “బుక్ మై షో “లో రివ్యూలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విశ్వక్ సేన్ తెలిపారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ఉదయం 6 గంటల నుంచే రివ్యూలు వచ్చినట్లు విశ్వక్ తెలిపారు.దీనిని బట్టి వారు సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారన్న విషయం అర్ధం అవుతుందని విశ్వక్ తెలిపారు.

Show comments