మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ “విశ్వంభర” కోసం మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘భోళా శంకర్’ వంటి నిరాశపరిచిన ఫలితం తర్వాత చిరు చేస్తున్న చిత్రం కావడం, పైగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రేంజ్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం,
Also Read : Sonu Sood: 500 మంది మహిళలకు..అండగా నిలిచిన సోనూసూద్
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ అతి త్వరలోనే రాబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే స్పష్టం చేశారు. అయితే సమ్మర్ రేసులో ఖచ్చితంగా ఏ రోజున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందో ఇప్పుడు స్పష్టత ఇవ్వబోతున్నారు. మరోవైపు, చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కూడా లైన్‌ల్లో ఉండటంతో, ఈ రెండింటిలో ఏది ముందు వస్తుంది? అనే ఉత్కంఠ నెలకొంది. ‘విశ్వంభర’ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ దీనిని సోలో రిలీజ్ డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారట. అంటే దీని బట్టి ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు త్వరలోనే చిత్ర యూనిట్ అదిరిపోయే కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
