NTV Telugu Site icon

Gangs Of Godavari : ఓటీటిలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Viswaksen

Viswaksen

Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Read Also :Adipurush : రావణుడిని రౌడీ లా చూపించడం బాధేసింది : ‘రామాయణ్’ సీత

ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అద్భుతమైన స్పందనతో దూసుకుపోతున్న ఈ మూవీ రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయి నెల కూడా పూర్తి కాకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది.ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా జూన్ 14 న తెలుగుతో పాటు కన్నడ ,మలయాళం ,తమిళ్ ,భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ తన ఎక్స్ ఖాతాలో స్పెషల్ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

Show comments