NTV Telugu Site icon

Gangs of Godavari Twitter Review: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?

Gangs Of Godavari Twitter Review

Gangs Of Godavari Twitter Review

Vishwak Sen’s Gangs of Godavari Public Talk: మాస్ కా దాస్ విష్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు. ఈ చిత్రంను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా వచ్చిన నటసింహం బాలకృష్ణతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో? చూద్దాం.

Also Read: Kantara Chapter 1: కాంతార చాఫ్టర్‌-1లో మాలీవుడ్‌ యాక్టర్!

సోషల్ ఈడియలో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఎక్స్‌లెంట్ అని, సెకండ్ హాఫ్ బాగుందని, విశ్వ‌క్‌ సేన్ యాక్టింగ్ బాగుందని ఒకరు ట్వీట్ చేశారు. సెకండ్ హాఫ్ స్లోగా ఉందని.. క్లైమాక్స్‌లో తండ్రీకూతుళ్ల సన్నివేశాలు, ముగింపు సన్నివేశాలు కాస్త సినిమాకు హెల్ప్ అయ్యాయని… మొత్తం మీద చూడదగిన చిత్రం అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఓటీటీ కూడా కాదు బొమ్మ లెవెల్ సినిమా.. మూస సినిమా తీసి దొబ్బాడు అని మరొకరు పేర్కొన్నారు. లంక‌ల‌ ర‌త్న పాత్ర‌లో విశ్వ‌క్‌ సేన్ యాక్టింగ్ బాగుంద‌ని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వ‌క్‌లోని మాస్ కోణాన్ని డిఫరెంట్‌గా చూపించారు అని అంటున్నారు.

Show comments