Gangs of Godavari: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్‌కు ముహూర్తం ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen’s Gangs of Godavari Teaser Update: గామి ఇచ్చిన విజయంతో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌సేన్.. మరో సినిమాను విడుదలకు చేసేందుకు సిద్దమయ్యాడు. ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్‌ను ఏప్రిల్ 27న సాయంత్రం 4.01 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మన లంకల రత్నం రేంజ్ మాములుగా ఉండదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 27న సాయంత్రం 4.01 గంటలకు ఉంటుంది. మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్’ అని ట్వీట్ చేశారు.
Also Read
Also Read: Singer Srilalitha: ఘనంగా ‘వరాహరూపం’ ఫేం శ్రీ లలిత నిశ్చితార్థం!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గ్యాంగ్‌స్టర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!