Gangs of Godavari: విశ్వక్‌ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజ‌ర్‌కు ముహూర్తం ఖరారు!

Gangs Of Godavari

Gangs Of Godavari

Vishwak Sen’s Gangs of Godavari Teaser Update: గామి ఇచ్చిన విజయంతో ‘మాస్‌ కా దాస్’ విశ్వక్‌ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఈ ఏడాది గామితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌సేన్.. మరో సినిమాను విడుద‌లకు చేసేందుకు సిద్దమయ్యాడు. ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌ సేన్ హీరోగా వస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ టీజ‌ర్ అప్‌డేట్ ఇచ్చారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజ‌ర్‌ను ఏప్రిల్ 27న సాయంత్రం 4.01 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ‘మన లంకల రత్నం రేంజ్ మాములుగా ఉండదు. మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజ‌ర్‌ లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 27న సాయంత్రం 4.01 గంట‌ల‌కు ఉంటుంది. మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్’ అని ట్వీట్ చేశారు.

Also Read: Singer Srilalitha: ఘనంగా ‘వరాహరూపం’ ఫేం శ్రీ లలిత నిశ్చితార్థం!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుంచి విడుదలైన పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గ్యాంగ్‌స్టర్ పాత్రలో విశ్వక్‌ సేన్ కనిపించనున్నాడు.