NTV Telugu Site icon

Vishwak Sen: వైరల్ అయిన ఆ ట్వ్వీట్ ను డిలీట్ చేసిన విశ్వక్ సేన్..కారణం అదేనా..?

Whatsapp Image 2023 10 29 At 3.52.02 Pm

Whatsapp Image 2023 10 29 At 3.52.02 Pm

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజున మరిన్ని సినిమాలు పోటీలోకి రావటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‍పై కన్ఫ్యూషన్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 29) విశ్వక్‍సేన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం సృష్టించింది.. బ్యాక్‍గ్రౌండ్ లేకపోతే ప్రతీ ఒక్కరూ ఆడుకుంటారంటూ ఘాటైన వ్యాఖ్యలతో ఆ పోస్ట్ చేసాడు హీరో విశ్వక్ సేన్..ఒకవేళ డిసెంబర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాకపోతే.. ఆ సినిమా ప్రమోషన్లలో తాను కనపడబోనని తన పోస్టులో విశ్వక్‍సేన్ పేర్కొన్నాడు.

“బ్యాక్‍గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దామనే అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా.. ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి చేసి చెబుతున్నా! డిసెంబర్ 8న కచ్చితంగా వస్తున్నాం.. హిట్, ప్లాఫ్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాఫ్.. మీ నిర్ణయమే. ఆవేశానికి లేదా ఈగోకి తీసకునే డెసిషన్ కాదు. తగ్గేకొద్ది తొక్కేస్తూనే ఉంటారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు.. ఒకవేళ డిసెంబర్ కాకపోతే ప్రమోషన్లలో నన్ను ఇక చూడరు” అని విశ్వక్‍సేన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.విశ్వక్‍సేన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది..ఎవరిని ఉద్దేశించి విశ్వక్ ఇలా అన్నారనే చర్చ సాగుతోంది. అయితే, పోస్ట్ చేసిన కొంత సమయానికి ఈ ట్వీట్‍ను డిలీట్ చేసి అందరికి ట్విస్ట్ ఇచ్చారు విశ్వక్. అయితే, విశ్వక్ చేసిన ఈ ట్వీట్.. ప్రమోషనల్ స్టంట్ అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. నిజంగా కోపం తో పోస్ట్ చేసి ఉంటే.. డిలీట్ ఎందుకు చేసినట్టు అని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై బజ్ నెలకొనేందుకు విశ్వక్ ఇలా చేశారని అనుమానిస్తున్నారు. అయితే, సినిమా వాయిదా పడుతుందనే బాధతోనే విశ్వక్ ఈ ట్వీట్ చేశారని మరికొందరు అతడికి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. విశ్వక్ చెప్పింది వాస్తవమేనంటూ కొంతమంది స్పందిస్తున్నారు.

Show comments