Site icon NTV Telugu

Vishwak Sen : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

Vishwak

Vishwak

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్ నూతన సంవత్సరంలో మరో సినిమాను రెడీ చేసాడు. యంగ్ దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘ లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ లో నటించాడు. లైలాగ పర్ఫెక్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు విశ్వక్. పిభ్రవరి 14వ తేదీన లైలా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Also Read : Yashika Aannand : యషిక ఆనంద్.. హాట్ లుక్స్.. క్యూట్ పిక్స్..

ఈ నేపథ్యంలో నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో విశ్వక్ సేన్. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల చేరుకున్నాడు సేన్. ఈ తెల్లవారు జామున బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను విశ్వక్ సేన్ కు అందజేశారు. దర్శననంతరం ఆయలం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ‘ స్వామి వారి ఆశీస్సులు, ఆయన చల్లని దీవెనలు ఎల్లప్పుడూ అందరికి ఉండాలి. అలాగే మా సినిమా ‘లైలా’ ట్రైలర్  ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపిస్తాను. కుటుంబంతో కలసి అందరు చూసే కామెడీ చిత్రం లైలా. మీ అందరికి తప్పకుండా అందరికి నచుతుంది’ అని అన్నారు. ఈ సినిమాలోని లైలా లుక్ ఆడియెన్స్ కు సరికొత్త ట్రీట్ ఇస్తుందని యూనిట్ భావిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version