NTV Telugu Site icon

Vishwak Sen : బాలయ్య నటి అంజలిని తోసేసిన ఘటనపై స్పందించిన విశ్వక్ సేన్..

Balayya ,anjali

Balayya ,anjali

Vishwak Sen :  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాను ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా మాస్ పాత్రలో కనిపించాడు..ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్ కు నందమూరి బాలయ్య ముఖ్య అతిధిగా వచ్చారు .

Read Also :Hari Hara Veera Mallu : పవన్ హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య స్టేజిపైకి వచ్చారు .ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి నెమ్మదిగా జరుగుతుంది.దీనితో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకు నెడతారు.దీనితో అంజలి ఒక్కసారిగా షాక్ అవుతుంది.అయితే ఆ విషయాన్నీ నటి అంజలి సరదాగా తీసుకోని తరువాత నవ్వేస్తుంది.కానీ ఈ విషయం గురించి వివాదం చెలరేగింది.బాలయ్యకు మహిళలకి గౌరవం ఇవ్వడం తెలీదని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ విషయంపై నటుడు విశ్వక్ సేన్ స్పందించారు..ఈవెంట్ లో జరిగింది వేరు సోషల్ మీడియాలో చూపించేది వేరు…దానిని ముందు వెనుక కట్ చేసి వైరల్ చేస్తున్నారు.బాలయ్య ఎప్పుడు అందరితో సరదాగా వుంటారు.ఆయనపై ట్రోల్స్ ఆపండి అని విశ్వక్ తెలిపారు.ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన చిన్న విషయం అది దానిని వివాదం చేయొద్దు అని నాగవంశీ తెలిపారు.

Show comments