Vishwak Sen : ‘ఫంకీ’గా మారబోతున్న విశ్వక్ సేన్.. ఆయన కోసమేనా ?
- విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫంకీ
- అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా మూవీ
- జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ టాక్ లభిస్తుండటంతో ఈ మూవీ వీకెండ్‌పై కన్నేసింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ వేళ, ఇప్పుడు విశ్వక్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Read Also:Election Results: మహారాష్ట్రలో బీజేపీ సంచలనం.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి..
Also Read
చాన్నాళ్ల కిందటే విశ్వక్ సేన్ 14వ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించనున్న ఈ కాంబినేషన్ నవ్వుల వర్షం క్రియేట్ చేయబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించనున్నారు. విశ్వక్ సేన్ ఇప్పటికే ‘లైలా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సందడి చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో సినిమా ఉంది.
Read Also:Nani : పవన్ కళ్యాణ్ పై న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు
హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో ఆదరగొట్టె హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ కెవి దిట్ట, వీరి కొలాబరేషన్ యూనిక్ స్టొరీ లైన్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాంబో విశ్వక్ సేన్ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని అనుదీప్ కెవి సిగ్నేచర్ హ్యూమర్‌తో బ్లెండ్ చేసి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘ఫంకీ’ అనే టైటిల్‌ని కూడా లాక్ చేశారని.. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పడనేది చూడాలి.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!