NTV Telugu Site icon

Gangs of Godavari : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?

Viswaksen

Viswaksen

Gangs of Godavari : మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.. ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.మే 31న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Also : IPL 2024 Final : ఆరంజ్ ఆర్మీకి స్పెషల్ విషెస్ తెలియజేసిన టాలీవుడ్ స్టార్స్..

అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ గా వున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ట్రైలర్ లో విశ్వక్ సేన్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురించి  స్పెషల్ అప్డేట్ వైరల్ అవుతుంది .మేకర్స్ మే28న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం .అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.