తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో దూసుపోతున్నారు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు రావడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మంచి మార్కెట్ కూడా ఉంది.. అయితే సినిమాల పరంగా బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..
విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్త వైరల్ గా మారింది. కోలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన లక్ష్మీ మీనన్ ను విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ అక్కడి సినీ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే.. విశాల్, లక్ష్మీ మీనన్ లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.. అంటూ నిన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి..
తాజాగా ఈ విషయం పై విశాల్ స్పందించినట్లు తెలుస్తుంది.. ఇందులో నిజం లేదని, అది కేవలం పూకారే అని తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లు వార్త నెట్టింట షికారు చేస్తుంది.. ఇలాంటి వార్తలను నమ్మవద్దని మీ అందరిని అభ్యర్థిస్తున్నాను మరియు అవి పూర్తిగా ఫేక్. దయచేసి ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం మానుకోండి’ అని విశాల్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రంట్‌లో, విశాల్ తన చిత్రం మార్క్ ఆంథోని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు, ఇది వినాయక చతుర్థి విడుదలకు సిద్ధంగా ఉంది..