Site icon NTV Telugu

Anesthetic Injections: విశాఖలో మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ఏడు వేల ఇంజెక్షన్స్ సీజ్

Injection

Injection

విశాఖలో డ్రగ్స్ చాపకింద నీరులా పాకుతుంది. అయితే, తాజాగా విశాఖపట్నంలో మరోసారి మత్తు ఇంజక్షన్లు కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. గంజాయి మత్తు ఇంజక్షన్లకు కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో మత్తు ఇంజెక్షన్లు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : L.V. Gangadhara Sastry: గంగాధర శాస్త్రికి గౌరవ డాక్టరేట్!

యువతను టార్గెట్ చేస్తు కొంతమంది ముఠాగా ఏర్పడి మత్తు ఇంజెక్షన్లు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి పశ్చిమ బెంగాల్ కు తరలిస్తుండగా ఈ మత్తు ఇంజెక్షన్లను పట్టుకున్నారు. ఎనిమిదిమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అలా రెండు రోజుల్లో మూడు కేసుల్లో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లను ముఠా నుంచి స్వాధీనం చేసుకుని వాటిని పోలీసులు సీజ్ చేశారు.

Also Read : Karnataka: డిప్యూటీ సీఎం దళితుడికి ఇవ్వకుంటే.. అధిష్టానానికి కాంగ్రెస్ లీడర్ వార్నింగ్..

విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ముఠాపై పోలీసులు స్పెషల్ గా నిఘా పెట్టారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడువేల మత్తు ఇంజెక్షన్లతో పాటు ఓ కారు,నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్లను కూడా సీజ్‌ చేశారు. యువతను టార్గెట్‌ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టగా కేటుగాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు. వైజాగ్ లో ఈ ఇంజక్షన్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యూత్‌ ను టార్గెట్ చేస్తూ ఈ దందా కొనసాగుతోంది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు.

Exit mobile version