TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Serial Scam: ఎవరిని నమ్మాలి..? ఎవరి పరిచయం వెనుక ఏ ప్లాన్ ఉందో కూడా తెలియని పరిస్థితులు.. నమ్మబలికి అడ్డంగా దోచేసి పరారవుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్‌లో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఈ మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి భార్యను విశాఖకు చెందిన వ్యక్తి టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన నిందితుడు, తనకు టెలివిజన్ రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి బాధితురాలిని నమ్మించాడు. సీరియల్స్‌లో హీరోయిన్ పాత్ర ఇప్పిస్తానని ఆశ చూపుతూ ఆమె నుంచి దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
నిందితుడు బాధితురాలి నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, వివిధ అవసరాల పేరుతో మొత్తంగా సుమారు రూ.60 లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి రూ.22 లక్షల విలువైన కారును కూడా కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనపై బాధితురాలు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు భాగంగా కారును కొనుగోలు చేసిన కార్ల షోరూం బ్యాంక్ అకౌంట్‌ను తెలంగాణ పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీంతో షోరూం యజమాని విశాఖ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తి విశాఖ నగరంలోని మధురవాడ బాంబే కాలనీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా పరిచయాలను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయొద్దని, ముఖ్యంగా సినీ అవకాశాలు, ఉద్యోగాలు లేదా పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Also Read
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..