NTV Telugu Site icon

IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం

Tickets

Tickets

IND VS AUS : నేటి నుంచే విశాఖ వన్డే టికెట్లు అమ్మకం ప్రారంభం కానుంది. ఈ నెల 19న ఏసీఏ వీడిసిఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా ల మధ్య సెకండ్ వన్డే జరగనున్నాయి. పేటీఎం ఇన్సైడర్ ద్వారా ఆన్లైన్లో టికెట్ల అమ్మకం జరుగనున్నాయి. టికెట్ కనీస ధర 600 రూపాయలు, గరిష్ట ధర 6000 రూపాయలకు అమ్మనున్నారు. ఇక ఈ నెల 14వ తేదీ నుండి మిగిలిన 30% టికెట్లు ఆఫ్లైన్ ద్వారా అమ్మనున్నారు. వైజాగ్‌ నగరంలో మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకులు. కాగా, ఈ నెల 19వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్‌ జరుగనుంది. అలాగే ఈనెల 13 నుంచి నగరంలోని మూడుచోట్ల ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం 27 వేలు. కాగా, ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఎన్ని టిక్కెట్లు అందుబాటులో ఉంచారన్నది నిర్వాహకులు వెల్లడించలేదు.

Read Also: Prithvi Shaw: పృథ్వీ షాకు ఏమైంది..?

అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. కెమరూన్ గ్రీన్ (64 బంతుల్లో 49 బ్యాటింగ్; 8 ఫోర్లు) రాణించాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38), ట్రావిస్ హెడ్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ లభించింది.

Show comments