NTV Telugu Site icon

Vizag MRO Incident: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ

Vizag Mro Incident

Vizag Mro Incident

Vizag MRO Incident: ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌.. ఘటన జరిగిన గంటల 14 గంటల వ్యవధిలో నిందితుడిని గుర్తించాం.. ఎమ్మార్వో హత్య కేసుకు ల్యాండ్ ఇష్యు నే కారణంగా పేర్కొన్నారు. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఎమ్మార్వో హత్యకు పాల్పడ్డట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.. అయితే, రియల్టర్, ఎమ్మార్వో మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ కావాల్సి ఉందన్నారు. హంతకుడు ప్రి ప్లాన్డ్ గానే ఫ్లైట్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాడు.. త్వరలో నిందితుడిని పట్టుకుని మరిన్ని వివరాలు అందిస్తాం అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు.. రాడ్డుతో రమణయ్యపై దాడి చేశారు.. మాకు డయల్ 112కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం.. మర్డర్ చేసిన తర్వాత సదరు వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్లినట్టు గుర్తించాం అన్నారు.

Read Also: Poonam Kaur : అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్.. ఆ బాధ ఎక్కువేనట..

అగంతకుడు చాలా సార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్ లోకి వెళ్లి వచ్చినట్టు సీసీటీవీ ద్వారా గుర్తించాం అన్నారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌.. వైజాగ్ లోని ఓ ల్యాండ్ కు సంబంధించి ఈ గొడవ జరిగింది.. నిందితుడు ఒక్కడే ఈ దాడి హత్యలో పాల్గొన్నాడు.. నిందితుడు పేరు, వివరాలు తెలిశాయి. కానీ, విచారణ కారణంతో నిందితుడి వివరాలు వెల్లడి చేయడం లేదన్నారు.. ఇద్దరు ఏసీపీలను, 10 బృందాలను ఏర్పాటు చేశాం.. కేస్ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడు ఒక బ్యాంక్ లోన్ వ్యవహారంలో డిఫాల్టర్ గా ఉన్నాడని గుర్తించాం.. పూర్తి వివరాలు నిందితుడు పట్టుబడ్డాక తెలియజేస్తాం అని తెలిపారు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌.. ఇంకా సీపీ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిన్‌ చేయండి..