NTV Telugu Site icon

Virginia : టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం.. పరారైన ఇద్దరు ఖైదీలు

Tooth Brush

Tooth Brush

టూత్ బ్రష్ తో ఏం చేస్తారు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది నోటిని శుభ్రం చేస్తామని చెబుతారు కదూ.. ఆగండి ఆగండి.. టూత్ బ్రష్ నోటీని బ్రష్ చేయడం తప్ప మరెందుకూ పనికి రాదని అప్పుడే ఓ అంచనాకు వచ్చేయకండి.. టూత్ బ్రష్ ని అంత తేలికగా తీసిపారేయకండి.. ఎందుకంటే.. టూత్ బ్రష్ ని జైలు గోడకు కన్నం వేసేందుకు కూడా వాడొచ్చని మీకు తెలుసా.. ఏంటీ అప్పుడే షాక్ అయ్యారా.. ఇది నిజ్జం.. ఇద్దరు ఖైదీలు అంతకుమించి అన్నట్లుగా టూత్ బ్రష్ ను వాడుకున్నారు. ఏకంగా జైలు గోడకి రంద్రం చేసి పారిపోయారు.

Also Read : Rahul Gandhi: ఇందిరాగాంధీ తీసుకువచ్చిన చట్టం.. రాహుల్‌గాంధీ చించేసిన చట్టం.. చివరకు తన అనర్హతకే కారణమైంది..

వర్జీనియాలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జైల్లో ఇద్దరు ఖైదీలు చేసిన పని పోలీసులకే దిమ్మతిరిగిపోయేలా చేసింది. క్రిడిట్ కార్డ్ మోసంతో జాన్ గార్జా(37), అర్లె నెమో (43) అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వారిద్దరూ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. అయితే జైలు నుంచి పారిపోవడానికి ఇద్దరు కలిసి ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ఇందుకోసం వారు టూత్ బ్రష్ ని ఆయుధంగా మార్చుకున్నారు. కొన్ని రోజులుగా టూత్ బ్రష్, లోహపు వస్తువు సాయంతో జైలు గోడకు రంధ్రం చేశారు. అదను చూసి పారిపోయారు.

Also Read : PAK vs AFG : పాకిస్తాన్ కి షాకిచ్చిన ఆఫ్ఘానిస్తాన్..

కొన్ని గంటల తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. ఖైదీలకు అటెండెన్స్ వేస్తున్న సమయంలో ఇద్దరు ఖైదీలు తక్కువ అయ్యారు. ఎవరా ఇద్దరు అని చూస్తూ గార్జా, నెమో అని తేలింది. అంతే పారిపోయిన ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు రంగంలోకి పోలీసులు దిగారు. జైలు సమీపంలోని అపార్ట్మెంట్ ప్రజల సాయంతో తిరిగి ఆ ఇద్దరు ఖైదీలను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేయగలిగారు. కాగా. టూత్ బ్రష్ తో జైలు గోడకు కన్నం వేసి ఖైదీలు పారిపోయిన వైనం.. సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు గోడలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మరమ్మత్తులు ప్రారంభించారు. గోడలు బలహీనంగా ఉన్న చోట్ల పోలీస్ అధికారులు రిపేర్లు చేస్తున్నారు.