NTV Telugu Site icon

Virender Sehwag: షాకింగ్.. విడాకుల తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్‌!

Virender Sehwag Divorce

Virender Sehwag Divorce

టీమిండియా అభిమానులకు భారీ షాక్. భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి వీరూ స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్‌, ఆర్తి అహ్లావత్‌లు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆర్యవీర్‌ (2007), వేదాంత్‌ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన సెహ్వాగ్‌, ఆర్తిల వైవాహిక జీవితంలో కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరూ చేసే ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల్లో ఆర్తి కన్పించకపోవడంతో.. వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు నెట్టింట మొదలయ్యాయి. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్‌ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే పంచుకున్నారు. 2023లో పెళ్లి రోజు సందర్భంగా భార్య ఆర్తితో దిగిన ఫొటోను వీరూ పోస్ట్ చేశారు.

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌, ఆర్తి అహ్లావత్‌లు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు సెహ్వాగ్‌ గానీ, ఇటు ఆర్తి గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కొంత కాలంగా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన సతీమణి ధనశ్రీ వర్మతో డివోర్స్ తీసుకోబుతున్నట్లు నెట్టింట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సెహ్వాగ్‌ భారత్ తరఫున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.