Virender Sehwag: షాకింగ్.. విడాకుల తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్!
- అభిమానులకు షాకింగ్ న్యూస్
- విడాకుల తీసుకోబోతున్న సెహ్వాగ్
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న వీరూ జోడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా అభిమానులకు భారీ షాక్. భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి వీరూ స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌లు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన సెహ్వాగ్, ఆర్తిల వైవాహిక జీవితంలో కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరూ చేసే ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో ఆర్తి కన్పించకపోవడంతో.. వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు నెట్టింట మొదలయ్యాయి. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే పంచుకున్నారు. 2023లో పెళ్లి రోజు సందర్భంగా భార్య ఆర్తితో దిగిన ఫొటోను వీరూ పోస్ట్ చేశారు.
Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌లు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు సెహ్వాగ్ గానీ, ఇటు ఆర్తి గానీ ఇప్పటివరకు స్పందించలేదు. కొంత కాలంగా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన సతీమణి ధనశ్రీ వర్మతో డివోర్స్ తీసుకోబుతున్నట్లు నెట్టింట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!