Goud Saab Movie: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another hero from the Prabhas Family: ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ మరో స్థాయికి తీసుకు వెళ్లారు. ఆ లెగసీని ప్రభాస్‌తో పాటు మరో హీరో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. అతడే ‘విరాట్ రాజ్’. ప్రభాస్‌కు కజిన్ అయిన విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. విరాట్ పరిచయం అవుతున్న సినిమాకు ముహూర్తం ఈరోజు ఘనంగా జరిగింది.
టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ ‘గణేష్ మాస్టర్’ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్‌ను ఆవిష్కరించారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ చిత్రానికి ‘గౌడ్ సాబ్’ అనే టైటిల్ పెట్టారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేపించిన గణేష్ మాస్టర్.. మెగా ఫోన్ పట్టాడు.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
Also Read: Kalki 2898 AD: ఏయ్ బాబు లెవ్.. అప్టేట్ కావాలి! ఇదేం ట్రెండ్ మావా?
గణేష్ మాస్టర్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. గౌడ్ సాబ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మరియు టీమ్ మొత్తంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్ఎం స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి.. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారట. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మంచి సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!