NTV Telugu Site icon

Goud Saab Movie: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్‌గా టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్!

Pawan Kalyan (1)

Pawan Kalyan (1)

Another hero from the Prabhas Family: ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఈశ్వర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కృష్ణంరాజు లెగసీని ప్రభాస్ మరో స్థాయికి తీసుకు వెళ్లారు. ఆ లెగసీని ప్రభాస్‌తో పాటు మరో హీరో కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. అతడే ‘విరాట్ రాజ్’. ప్రభాస్‌కు కజిన్ అయిన విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. విరాట్ పరిచయం అవుతున్న సినిమాకు ముహూర్తం ఈరోజు ఘనంగా జరిగింది.

టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ ‘గణేష్ మాస్టర్’ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో విరాట్ రాజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ టైటిల్‌ను ఆవిష్కరించారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ చిత్రానికి ‘గౌడ్ సాబ్’ అనే టైటిల్ పెట్టారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్టెప్పులేపించిన గణేష్ మాస్టర్.. మెగా ఫోన్ పట్టాడు.

Also Read: Kalki 2898 AD: ఏయ్ బాబు లెవ్.. అప్టేట్ కావాలి! ఇదేం ట్రెండ్ మావా?

గణేష్‌ మాస్టర్‌ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని డైరెక్టర్ సుకుమార్‌ తెలిపారు. గౌడ్ సాబ్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని పేర్కొన్నారు. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మరియు టీమ్‌ మొత్తంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌ఎం స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి.. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని చూస్తున్నారట. గణేష్ మాస్టర్, విరాట్ రాజ్ మంచి సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.