Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించిన ఆర్సీబీ, ఇప్పుడు మరోసారి విజేతగా నిలిచి తమ జోరును కొనసాగించి గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించింది. ఈ విజయంతో జట్టు శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. విజయానంతరం జరిగిన సెలబ్రేషన్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి ఆమె విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటర్ దినేశ్ కార్తిక్‌ను అనుష్క హత్తుకున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో పక్కనే నిలబడి ఉన్న విరాట్ కోహ్లీ కూల్ రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ మొత్తం సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా పెద్ద మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని చాటుతూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 42 బంతుల్లో అజేయంగా 75 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్ విజయోత్సాహం అనంతరం విరాట్ కోహ్లీ త్వరలోనే భారత జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ నెలలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు.
Anushka Sharma hugged Dinesh Karthik after historical win against GT.😭
– Just look at the reaction of Virat Kohli.😭😂pic.twitter.com/VbjYqmyKuR
— Cricket Central (@CricketCentrl) June 1, 2026
