Site icon NTV Telugu

Virat Kohli: ఏంటి.. కోహ్లీ మరో టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా..? నిజమెంత..?

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అలంటి వార్త మరొకటి చక్కర్లు కొడుతుంది. భారత క్రికెట్లో ఒక లెజెండ్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఎన్నో పరుగులు చేసాడు. అంతే కాదు ఎంతోమంది యంగ్ ప్లేయర్లకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా కూడా నిలుస్తున్నాడు. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు.

Read Also:Wimbledon 2025: టైటిల్ ఫేవరేట్ సబలెంకకు షాక్.. ఫైనల్ లో అనిసిమోవా..!

అయితే, ప్రస్తుతం టెస్ట్‌లు, టీ20 ఫార్మాట్‌ లకు గుడ్‌బై చెప్పి వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. అలాగే ఐపీఎల్ లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. అంతేకాదు, గత ఐపీఎల్ సీజన్లో RCB ట్రోఫీ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ లోనూ అతడు ఆడే అవకాశం ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనిపై ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అదేంటంటే..

Read Also:Modi Retirement Debate: 75 ఏళ్లకే రిటైర్ కావాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోడీపై కాంగ్రెస్ సెటైర్లు!

ఢిల్లీ క్రికెట్‌కు కోహ్లీ ఎప్పుడూ అండగా ఉన్నాడని.., యంగ్‌ క్రికెటర్లను గైడ్‌ చేస్తూ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీ క్రికెట్‌కు అవసరం ఉన్నప్పుడు అతడు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని జైట్లీ అన్నారు. కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ DPLలో ఆడితే ఆనందంగా ఉంటుందన్నారు. అంతే కాదు అతడి స్థాయి, ఎక్స్‌పీరియెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే అతడి గైడెన్స్‌ యంగ్‌ ప్లేయర్స్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కోహ్లీకి ఢిల్లీ క్రికెట్‌తో కెరీర్‌ ఆరంభం నుంచి బలమైన బంధం ఉందని, గతంలో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌ల్లో కూడా ఆడాడని గుర్తు చేశారు. కాగా కోహ్లీ చివరగా 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ తరుపున బరిలోకి దిగాడు. దీంతో తన లాస్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ను కూడా ఇక్కడే ముగించాడు. అయితే ఈ లీగ్ లో కోహ్లీ ఆడుతుందా లేదా అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Exit mobile version