Site icon NTV Telugu

Virat Kohli: ఈ టోర్నీలో ఆడటానికి ‘కింగ్’ కోహ్లీ నో చెప్పాడా?

Virat Kohli

Virat Kohli

Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ డిసెంబర్ 3న జరగనుంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ముఖ్యమైన న్యూస్ వైరల్‌గా మారింది. డిసెంబర్ 24, 2025 నుంచి ప్రారంభమయ్యే దేశీయ టోర్నమెంట్‌లో కింగ్ కోహ్లీ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 ఏళ్ల తర్వాత దేశీయ టోర్నమెంట్‌లోకి కోహ్లీ తిరిగి వచ్చి కొన్ని మ్యాచ్‌లు ఆడవచ్చని గతంలో ప్రచారం జరిగింది.

READ ALSO: CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అయితే ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆడకూడదని తీసుకున్న నిర్ణయం బీసీసీఐకి కొత్త సవాలుగా మారింది. పలు నివేదికల ప్రకారం.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే మూడ్ కోహ్లీకి లేదని చెబుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఆడటం అనేది భారత ఆటగాళ్లకు తప్పనిసరి, కానీ కోహ్లీ ఈ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే రోహిత్, విరాట్ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని, 2025-26 ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆశిస్తుంది. అయితే విరాట్‌కు ఈ టోర్నీలో ఆడే మూడ్‌లో ఉన్నట్లు కనిపించడం లేదని సమాచారం.

ఇదే సమయంలో ఈ టోర్నీలో రోహిత్ శర్మ పాల్గొనడాన్ని సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ టోర్నీలో పాల్గొనకుండా కోహ్లీకి ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం ఇప్పుడు BCCIకి మరింత కష్టమైంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ 16 ఏళ్ల క్రితం చివరిసారిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. 2008 నుంచి 2010 వరకు, ఈ స్టార్ ప్లేయర్ ఢిల్లీ తరపున 13 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి, నాలుగు సెంచరీలతో సహా మొత్తం 819 పరుగులు చేశాడు. అయితే విరాట్ గత ఏడాది రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చి, ఢిల్లీ తరపున ఒకే మ్యాచ్ ఆడాడు.

READ ALSO: Sanyuktha Menon: అఖండ 2 ఛాన్స్ ఎలా దక్కిందో చెప్పిన సంయుక్త.. అసలు కథ ఇదే!

Exit mobile version