Site icon NTV Telugu

Virat Kohli: న్యూజిలాండ్‌పై విధ్వంసం.. సెంచరీతో చెలరేగిన కోహ్లీ

Kohli

Kohli

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో కివీస్ పై విరుచుకుపడ్డాడు. 40వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది కొత్త సంవత్సరంలో విరాట్ కి మొదటి సెంచరీ. 95 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు బాది 103 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తున్నాడు. ఇది 54వ వన్డే సెంచరీ. ఇది కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో 85వ సెంచరీ కూడా.

Also Read:Mobile phone: మొబైల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య..

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీల బలంతో, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఇండోర్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 338 పరుగుల భారీ స్కోరును సాధించింది. తొలి వన్డేలో భారత్‌ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయాన్ని అందుకుంది.

Exit mobile version