NTV Telugu Site icon

Virat Kohli: ఆ సందర్భాల్లో హార్ట్ బ్రేక్ అయింది.. కోలుకోవడానికి సమయం పట్టింది

Virat Kohli

Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ గురించి గానీ.. అతని రికార్డుల గురించి గానీ తెలియని వారు ఎవరుండరు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే.. ఇన్ని రికార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ రెండు సందర్భాల్లో తన హృదయం బద్దలైందని చెప్పారు. ఇటీవ‌ల‌ జియో సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీ.. 2016లో జ‌రిగిన‌ ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తన హార్ట్ బ్రేక్ అయింద‌ని చెప్పుకొచ్చారు. ఇంట‌ర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. “నా జీవితంలో 2016లో రెండుసార్లు హృద‌యం బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్ కప్ కాగా, మరొకటి అదే ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్. ఈ రెండింట్లో టీమిండియా ఓడిపోవడం నన్ను ఎంతో కుంగదీశాయి. భారత్ కు ప్రపంచకప్ అందించగలను అని అనుకున్నా అది నెరవేరలేదు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది” అని కోహ్లీ వెల్లడించారు.

DK Shivakumar: ప్రధాని మోడీ పరువు తీసేందుకు డీకే శివకుమార్ రూ. 100 కోట్లు ఆఫర్ చేశాడు: బీజేపీ నేత..

కాగా, 2016 టీ20 వరల్డ్ క‌ప్‌లో టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. సెమీస్ లో కరేబియ‌న్ జ‌ట్టుతో త‌ల‌ప‌డి.. టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ సునాయాసంగా ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్ లో కోహ్లీ అజేయంగా 89 ర‌న్స్ సాధించాడు. మొత్తంగా ఈ టోర్నీలో కోహ్లీ 273 పరుగులు చేశాడు. మరోవైపు.. 2016లో జరిగిన ఐపీఎల్ లో ఆర్సీబీ ఫైనల్ కు చేరింది. కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది.

CSK vs RCB: ఈరోజు చెన్నైపై బెంగళూరు గెలుస్తుంది.. ఆర్సీబీ ఫ్యాన్స్

209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు.. పరాజయం పాలైంది. దీంతో.. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ ను చేజార్చుకుంది. కాగా.. ఆ సీజన్లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. 4 సెంచరీలు కూడా బాదాడు. అయితే.. ఇన్ని పరుగులు చేసినా ఆర్‌సీబీ టైటిల్ గెల‌వ‌క పోవడం విరాట్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా.. ప్రస్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్‌లోనూ కింగ్ కోహ్లీ టాప్ స్కోర‌ర్ (661 ప‌రుగులు) గా ఉన్నారు. అయితే మ‌రికొన్ని గంట‌ల్లో సీఎస్‌కేతో ఆర్‌సీబీ కీల‌క మ్యాచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ జ‌ట్టుకు ప్లేఆఫ్ బెర్త్ ద‌క్కే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఓడితే బెంగ‌ళూరు జ‌ట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.