Virat Kohli: “పడిక్కల్ దూకుడు చూసి ఒక్కటే చెప్పాను”.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా రాణించడంతో 202 పరుగుల ఛేదనను కేవలం 15.4 ఓవర్లలోనే పూర్తి చేశారు. ఈ వీరోచిత ఛేదనకు అసలైన పునాది వేసింది దేవదత్ పడిక్కల్. అతను కేవలం 26 బంతుల్లో 61 పరుగులు చేశాడు. పడిక్కల్ బ్యాటింగ్‌పై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించాడు. పడిక్కల్ విధ్వంసానికి కోహ్లీ ఫిదా అయ్యాడు. పడిక్కల్ ఆడిన తీరు అద్భుతమని, అతను క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపాడు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
“నా ఓపెనింగ్ పాట్నర్ ఫిల్ సాల్ట్ అవుటైన తర్వాత నేను గేర్లు మార్చి మరింత దూకుడుగా ఆడాలని ప్లాన్ చేసుకున్నాను.. నేను పవర్ ప్లేలో అగ్రెసివ్‌గా ఆడుదామని నిర్ణయించుకున్నాను. కానీ.. పడిక్కల్ బ్యాటింగ్ చూశాక స్ట్రైక్ ఇచ్చేశాను. పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఒక స్లోయర్ డెలివరీని మిడ్-ఆన్ మీదుగా పడిక్కల్ సిక్సర్‌గా మలచిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. నువ్వు బాగా ఆడుతున్నావ్. ఇలాగే కొనసాగించు. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను మన వైపు లాగేసుకో అని చెప్పాను. కేవలం గెలుపు మాత్రమే ముఖ్యం కాదు. నెట్‌రన్‌రేట్ సైతం మెరుగు పరుచుకోవడం ముఖ్యం. 25-26 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాలని పడిక్కల్‌కు చెప్పాను. అతడు అలాగే చేశాడు.” అని విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. చాలా కాలంగా ఆర్‌సీబీలో పడిక్కల్‌తో కలిసి ప్రయాణించిన కోహ్లీ, అతనిలోని అసలైన ప్రతిభను ఈ స్థాయిలో చూడటం ఇదే తొలిసారి అని కొనియాడాడు. ఇటీవల డొమెస్టిక్ రెడ్-బాల్ సీజన్‌లో పడిక్కల్ అద్భుతంగా రాణించాడు. అది అతడికి కలిసి వచ్చింది. టైమింగ్, హెడ్ పొజిషన్, బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో ఉన్నాయని తెలిపాడు. పడిక్కల్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి ప్రదర్శన కనబరచగలడో ఈ మ్యాచ్‌తో అర్థమైందన్నాడు.
READ MORE: Vichithra :చిన్న సినిమా.. పెద్ద ఎమోషన్! ఆకట్టుకుంటున్న ‘విచిత్ర’ మూవీ అప్‌డేట్స్!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..